కొనసాగుతున్న 'శ్యామ్ సింగ రాయ్' పోరాటం!
- ఈ నెల 24న వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'
- తెలుగు రాష్ట్రాల్లో 32.06 కోట్ల గ్రాస్
- ప్రపంచవ్యాప్తంగా 43.95 కోట్ల గ్రాస్
- ఓవర్సీస్ లోను నిలకడగా ఉన్న వసూళ్లు
నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను తెరకెక్కించాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన ఈ సినిమాలో, కథానాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా అలరించారు.
ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కథాకథనాల్లోని కొత్తదనం .. వైవిధ్యభరితమైన పాత్రలు .. ఆకట్టుకునే పాటల కారణంగా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. అయితే ఏపీలో నెలకొన్న కొన్ని పరిస్థితులు అక్కడి వసూళ్లపై కొంత ప్రభావం చూపించాయి.
అయినా ఈ సినిమా ఈ రెండు రాష్ట్రాల్లోను కలుపుకుని 11 రోజుల్లో 18.46 కోట్ల షేర్ ను, 32.06 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 24.80 కోట్ల షేర్ ను .. 43.95 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఓవర్సీస్ లోను నిలకడగా ఉన్న ఈ సినిమా, 8 లక్షల డాలర్స్ ను క్రాస్ చేసి, మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ప్రతికూల పరిస్థితులలోను ఈ సినిమా ఈ స్థాయి పోరాటం చేస్తుండటం విశేషం. .
ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కథాకథనాల్లోని కొత్తదనం .. వైవిధ్యభరితమైన పాత్రలు .. ఆకట్టుకునే పాటల కారణంగా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. అయితే ఏపీలో నెలకొన్న కొన్ని పరిస్థితులు అక్కడి వసూళ్లపై కొంత ప్రభావం చూపించాయి.
అయినా ఈ సినిమా ఈ రెండు రాష్ట్రాల్లోను కలుపుకుని 11 రోజుల్లో 18.46 కోట్ల షేర్ ను, 32.06 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 24.80 కోట్ల షేర్ ను .. 43.95 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఓవర్సీస్ లోను నిలకడగా ఉన్న ఈ సినిమా, 8 లక్షల డాలర్స్ ను క్రాస్ చేసి, మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ప్రతికూల పరిస్థితులలోను ఈ సినిమా ఈ స్థాయి పోరాటం చేస్తుండటం విశేషం.