భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ బూస్టర్ టీకా క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి

  • ఫేస్-3 ట్రయల్స్ చేపట్టనున్న కంపెనీ
  • 5,000 మందిపై పరీక్షలు
  • మార్చి నాటికి అందుబాటులోకి టీకా
భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ టీకా మూడో దశ క్లినియల్ ట్రయల్స్ కు ఔషధ నియంత్రణ మండలికి చెందిన నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఫేస్-3 సుపీరియారిటీ అధ్యయనం, అలాగే, ఫేస్-3 బూస్టర్ డోస్ స్టడీ నిర్వహించేందుకు అనుమతించింది. ప్రోటోకాల్ ప్రకారం అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ముక్కు ద్వారా ఇచ్చే ఈ టీకాను బూస్టర్ డోస్ గా ఇవ్వొచ్చని భారత్ బయోటెక్ చెబుతోంది. కొవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు లేదా బూస్టర్ డోస్ గా దీన్ని ఇవ్వొచ్చని చెబుతోంది. రెండు దశలుగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లోనూ మంచి ఫలితాలు కనిపించినట్టు పేర్కొంది.

ఎస్ఈసీ అనుమతి రావడంతో భారత్ బయోటెక్ సంస్థ 5,000 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. దీని ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగ అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో ఈ ప్రక్రియ పూర్తయితే మార్చి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.


More Telugu News