'సూపర్ మచ్చి' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

  • యూత్ కోసం 'సూపర్ మచ్చి'
  • కల్యాణ్ దేవ్ జోడీగా రచిత రామ్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ఈ నెల 14వ తేదీన విడుదల  
కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో 'సూపర్ మచ్చి' సినిమా రూపొందింది. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, విడుదల విషయంలో జాప్యం జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'డించక్ డించక్' అంటూ ఈ పాట సాగుతోంది. పబ్ నేపథ్యంలో యూత్ తో జోష్ ఫుల్ గా సాగే పాట ఇది. నేపథ్యానికి తగినట్టుగానే రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.

సాకేత్ ఆలపించిన ఈ పాటకి తమన్ సెట్ చేసిన బీట్ యూత్ ను ఆకట్టుకుంటోంది. 'ఆట' సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. కల్యాణ్ దేవ్ డాన్స్ లో కాస్త రాటుదేలినట్టుగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా రచిత రామ్ పరిచయమవుతోంది. ఇటు కల్యాణ్ దేవ్ కెరియర్ కి .. అటు రచిత రామ్ ఎంట్రీకి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.


More Telugu News