ఈ కిట్లతో కోవిడ్ వున్నదీ, లేనిదీ స్వయంగా టెస్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు!
- ఒక్కో కిట్ ధర రూ.250
- ముక్కులోపలి స్రావాలతో పరీక్ష
- వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ యాప్స్
- వీటన్నింటికీ ఐసీఎంఆర్ అనుమతి
కరోనా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పూర్వపు డెల్టా రకంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా ఇది వ్యాప్తి చెందుతున్నట్టు ఇప్పటికే గుర్తించారు. ఇన్ఫెక్షన్ తీవ్రత ఈ రకంలో తక్కువగానే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. అయినా నిర్లక్ష్యం పనికిరాదనీ, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేసుకుని, పాజిటివ్ గా నిర్ధారణ అయితే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా శరీరంపై వైరస్ దుష్ప్రభవాలు దీర్ఘకాలం పాటు ఉండకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.
ఇక కరోనా పరీక్ష చేసుకునే యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పుడు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కిట్ తెచ్చుకుని ఎవరికి వారే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టెస్ట్ లో నెగెటివ్ వచ్చినప్పటికీ కరోనా ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు ఉంటే, ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకుని మరోసారి నిర్ధారణ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆయా యాంటిజెన్ టెస్ట్ కిట్ల వివరాలు...
మైల్యాబ్ కోవిసెల్ఫ్: దీని ధర రూ.250. మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తయారు చేసిన ఈ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి ఉంది. ముక్కు లోపలి స్రావాలను తీసుకుని కిట్ పై వేయడం ద్వారా ఫలితాన్ని తెలుసుకోవచ్చు. టెస్ట్ ఎలా చేయాలో కిట్ లో ఉన్న బ్రోచర్ చూస్తే తెలుస్తుంది. అలాగే, మైల్యాబ్ యాప్ నుంచి కూడా తెలుసుకోవచ్చు.
కోవిఫైండ్: అనే కిట్ ధర కూడా రూ.250. ముక్కు లోపలి స్రావాలతోనే ఈ టెస్ట్ ను చేసుకోవాలి. కోవిఫైండ్ యాప్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
ప్యాన్ బయో కోవిడ్ 19 యాంటిజెన్ టెస్ట్ డివైజ్: అబ్బాట్ కంపెనీ దీన్ని విక్రయిస్తోంది. ధర రూ.250. నాసల్ స్వాబ్ ఆధారిత టెస్ట్ కిట్ ఇది. పరీక్ష ఎలా చేసుకోవాలి, ఫలితాలు ఎలా తెలుసుకోవాలి? అన్నవి NAVICA-IN యాప్ సాయంతో తెలుసుకోవచ్చు.
కోవిడ్ 19 ఏజీ కార్డ్: ఇది కూడా అవే తరహాలో చేసుకోవాల్సిన పరీక్షా కిట్. దీని ధర కూడా రూ.250. ఇంకా క్లినిటెస్ట్, అల్ట్రా కోవిక్యాచ్, అబ్ చెక్ కిట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతి ఉంది.