దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 58,097 కేసుల నమోదు
- కరోనాతో నిన్న 534 మంది మృతి
- డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతం
- యాక్టివ్ కేసులు 2,14,004
- మృతుల సంఖ్య మొత్తం 4,82,551
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొన్న 37,379 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,389కు చేరింది. కరోనాతో నిన్న 534 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,14,004 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కు చేరింది. కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,82,551కి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 147.72 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.