స్కూలు డైరెక్టర్‌పై ఆర్మీ జవాను కాల్పులు.. అడ్డొచ్చిన జవాను భార్య భుజంలో దిగబడిన తూటా
- రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఘటన
- హోంవర్క్ చేయనందుకు చెంపపై కొట్టి మందలించిన టీచర్
- ఘటన తర్వాత పరారైన జవాను
తన కుమార్తెను చెంపదెబ్బ కొట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఆర్మీ జవాను స్కూలుకెళ్లి పాఠశాల డైరెక్టర్‌పై కాల్పులు జరిపాడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కన్వాడా గ్రామానికి చెందిన ఆర్మీ జవాను పప్పు గుర్జార్ కుమార్తె స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది.
హోం వర్క్ చేయనందుకు ఉపాధ్యాయురాలు ఆమెను మందలిస్తూ చెంపదెబ్బ కొట్టింది. విషయాన్ని ఆ చిన్నారి తండ్రికి చెప్పింది. కుమార్తెపై టీచర్ చేయి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన గుర్జార్ నేరుగా పాఠశాలకు వెళ్లి డైరెక్టర్‌ను కలిసి వాగ్వివాదానికి దిగాడు.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన గుర్జార్ వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. అదే సమయంలో గొడవను ఆపేందుకు మధ్యలోకి వచ్చిన గుర్జార్ భార్య భుజంలోకి తూటా దూసుకెళ్లింది. దీంతో భయపడిన జవాను అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన గుర్జార్ భార్యను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.