మాస్కులు లేకుండా తిరుగుతున్న జనం.. కారు ఆపి మాస్కులు పంచిపెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్
- హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా ఘటన
- మాస్కులు స్వయంగా తొడిగిన సీఎం
- ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకోవాలని సూచన
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై మాస్కులు లేకుండా తిరుగుతున్న జనాన్ని చూసి కాన్వాయ్ ఆపి మాస్కులు పంచిపెట్టారు. కొందరికి ఆయన స్వయంగా మాస్కులు తొడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టాలిన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కొందరు మాస్కులు లేకుండా తిరగడం చూశానని పేర్కొన్న స్టాలిన్ వారికి మాస్కులు అందించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు.