7 వికెట్లతో చెలరేగిన శార్దూల్ ఠాకూర్... తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 229 ఆలౌట్
- అద్భుత బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్
- భారత్ పై దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం
- అర్ధసెంచరీలతో రాణించిన పీటర్సన్, బవుమా
- రాణించిన లోయరార్డర్
జోహాన్నెస్ బర్గ్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 229 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా భారత్ పై దక్షిణాఫ్రికా 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేస్తూ 7 వికెట్లు తీయడం విశేషం. దక్షిణాఫ్రికాపై ఓ భారత బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే. ఇక, షమీకి 2 వికెట్లు, బుమ్రాకు 1 వికెట్ దక్కాయి.
దక్షిణాఫ్రికా జట్టులో కీగాన్ పీటర్సన్ (62), టెంబా బవుమా (51) అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ (28) వికెట్ కీపర్ వెర్రీన్ (21), మార్కో జాన్సెన్ (21), కేశవ్ మహరాజ్ (21) కూడా ఓ మోస్తరు పరుగులు చేశారు.