బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన లోక్ సభ స్పీకర్
- ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యపై సంజయ్ దీక్ష
- కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అరెస్ట్
- ప్రివిలేజ్ మోషన్ కింద స్పీకర్ కు లేఖ రాసిన సంజయ్
- హోంశాఖ కార్యదర్శిని ఆదేశించిన స్పీకర్ ఓం బిర్లా
తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అరెస్ట్ చేసే సమయంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తన చొక్కా పట్టుకుని వ్యానులోకి తోశారని బండి సంజయ్ ఆరోపించారు. ఎంపీగా తన గౌరవానికి భంగం కలిగించారని తెలిపారు. ఈ మేరకు స్పీకర్ కు లేఖ రాశారు.
బండి సంజయ్ లేఖపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ అరెస్ట్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి స్పందించారు. బండి సంజయ్ అరెస్ట్ వివరాలు అందజేయాలంటూ తెలంగాణ సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
ఉపాధ్యాయుల బదిలీలు, జీవో 317లో మార్పులపై బండి సంజయ్ కరీంనగర్ లో జాగరణ దీక్ష చేపట్టడం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ పోలీసులు అర్ధరాత్రి వేళ బండి సంజయ్ దీక్షను భగ్నం చేశారు.