సంక్రాంతికి 'బంగార్రాజు' రావడం ఖాయమైనట్టే!
- 'బంగార్రాజు' గా నాగార్జున
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- ఆసక్తిని చూపుతున్న ప్రేక్షకులు
- జనవరి 13వ తేదీన వచ్చే ఛాన్స్
ఈ సారి కరోనా కారణంగా పెద్ద సినిమాల విడుదల విషయం అయోమయంగా మారింది. సంక్రాంతికి థియేటర్లకు వెళదామని అనుకున్న 'ఆర్ ఆర్ ఆర్' తన ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. మరో వైపున 'రాధే శ్యామ్' రిలీజ్ గురించి రోజుకో వార్త వస్తుండటంతో 'బంగార్రాజు' ముందుకు వెళ్లాలా? వద్దా? అనే ఆలోచన చేయవలసి వచ్చింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ దాదాపు ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ముందుగా ఈ సినిమా జనవరి 15వ తేదీన రావాలనుకుంది. కానీ ఇప్పుడు 13వ తేదీని ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి తగిన గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడంతో ఈ సారి వసూళ్లన్నీ 'బంగార్రాజు' ఎకౌంట్ కి వెళ్లడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
ఇక 'రాధేశ్యామ్' విషయానికి వస్తే ఈ సినిమా జనవరి 14వ తేదీ నుంచి కదిలే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ తేదీన విడుదల చేయవలసిందే అనే ఆలోచనలో ఉన్నారట. ఆ తరువాత ఇతర భాషల్లో విడుదల .. ఓటీటీ ఆఫర్లను గురించిన ఆలోచన చేస్తారని చెప్పుకుంటున్నారు.