'సూపర్ మచ్చి' నుంచి వచ్చేస్తున్న సాంగ్!

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'సూపర్ మచ్చి'
  • కథానాయికగా రచిత రామ్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ఈ నెల 14న సినిమా రిలీజ్    
కల్యాణ్ దేవ్ హీరోగా కొంతకాలం క్రితమే 'సూపర్ మచ్చి' సినిమా రెడీ అయింది. అయితే కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వదిలారు.

సంక్రాంతి బరిలో నుంచి 'ఆర్ ఆర్ ఆర్' తప్పుకోవడంతో, చాలా చిన్న సినిమాలు రంగంలోకి దిగిపోతున్నాయి. అలా 'సూపర్ మచ్చి' కూడా బరిలోకి వచ్చేసింది. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాతో రచిత రామ్ కథానాయికగా పరిచయమవుతోంది.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి రేపు ఉదయం 10:15 నిమిషాలకు 'డించకు డించకు' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోవడానికి కల్యాణ్ దేవ్ ట్రై చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఎంతవరకూ సక్సెస్ అవుతాడనేది చూడాలి మరి..


More Telugu News