చైనాకు దీటైన జవాబు.. గల్వాన్​ లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన మన జవాన్లు.. ఇవిగో ఫొటోలు

  • చైనా ఎగరేసిన రోజే త్రివర్ణ పతాకం ఆవిష్కరణ
  • ఫొటోలను ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి రిజిజు
  • ధీశాలులైన సైనికులు జెండా ఎగరేశారంటూ పోస్ట్
గల్వాన్ లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చగొట్టిన చైనాకు అంతే దీటుగా మన సైన్యమూ జవాబిచ్చింది. గల్వాన్ వ్యాలీలో చైనా జెండాను ఆవిష్కరించిన రోజునే మన సైన్యమూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. తాజాగా దానికి సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో ఫొటోలను తాజాగా పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం రోజున ధీశాలులైన భారత జవాన్లు గల్వాన్ లోయలో జెండా ఎగరేశారంటూ కామెంట్ చేశారు.


ఇక అంతకుముందు గత ఏడాది డిసెంబర్ 30 రాత్రి అరుణాచల్ స్కౌట్స్, అస్సాం రెజిమెంట్ జవాన్లతో కలిసి రిజిజు అరుణాచల్ ప్రదేశ్ లోని బోమ్డిలాలోని ఆర్ఆర్ హిల్స్ లో కలియతిరిగారు. సైనికులతో మాట్లాడారు. మైనస్ 8 డిగ్రీల శీతల పరిస్థితుల్లోనూ మన సైన్యం పనిచేస్తోందని, భారత సైన్యం జోష్ ఎప్పుడూ అత్యున్నతంగానే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.


 


More Telugu News