వన్డే సిరీస్ కు దూరం కానున్న విరాట్ కోహ్లీ?

  • వెన్ను నొప్పితో రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ
  • వైద్యుల పర్యవేక్షణలో కోహ్లీ ఉన్నాడన్న కేఎల్ రాహుల్
  • వన్డే సిరీస్ కు కోహ్లీ దూరమవుతాడంటూ ముందు నుంచే వార్తలు
దక్షిణాఫ్రికా టూర్ లో ఉన్న టీమిండియాకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది. వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. మరోవైపు టాస్ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, కోహ్లీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పాడు. ఆయన త్వరగా కోలుకుంటాడని తెలిపారు.

మరోవైపు వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచే వార్తలు వినిపించాయి. వ్యక్తిగత కారణాలతో ఆయన తప్పుకుంటాడని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కు కోహ్లీ దూరం కావడం పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు గాయం కారణంగా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఈ టూర్ కు దూరంగా ఉన్నాడు. దీంతో వన్డే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే ఈ నెల 19న జరగనుంది.


More Telugu News