బాలయ్యతో సినిమాను అలా ప్లాన్ చేశాడట!

  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
  • తదుపరి సినిమా అనిల్ రావిపూడితో
  • జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన  
బాలకృష్ణ తన తదుపరి సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో ఉన్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా దునియా విజయ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్టుపైకి బాలయ్య వెళ్లనున్నారు.

బాలకృష్ణకి కథ చెప్పి, ఓకే చేయించుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల కాగానే రెండు నెలల పాటు స్క్రిప్ట్ పై కసరత్తును పూర్తి చేసి, జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నాడట.

ఈ సినిమాను 2023 సంక్రాంతి బరిలో నిలబెట్టాలనే నిర్ణయంతో ఆయన ఉన్నాడని అంటున్నారు. నిజానికి అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. 'ఎఫ్ 3' సినిమాను ఈ సంక్రాంతి బరిలో దింపాలనే ఆయన అనుకున్నాడుగానీ కుదరలేదు. అందువలన బాలయ్య సినిమాకి వచ్చే సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాడట. ఈ సినిమాలో కథానాయికగా ఇంతవరకైతే మెహ్రీన్ పేరే వినిపిస్తోంది మరి!


More Telugu News