సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే మాకు సంబంధం ఉండదు: పేర్ని నాని

  • ఓ చానల్ వేదికగా ఆర్జీవీతో మాట్లాడిన మంత్రి
  • టికెట్ ధరల వివాదంపై స్పందన
  • సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ
సినిమాటోగ్రఫీ చట్టం ఎప్పటి నుంచో ఉందని దానిని తాను, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా తీసుకొచ్చింది కాదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఓ చానల్ వేదికగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్జీవీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి.. టికెట్ ధరల విషయమై పైవిధంగా స్పందించారు.

సినిమా టికెట్ ధరల విషయంలో గత ప్రభుత్వాలు కూడా కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదన్న మంత్రి.. థియేటర్లలో విడుదల చేస్తే మాత్రం తప్పకుండా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో తమ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఓ న్యాయమూర్తి సమర్థించారని, ఇటీవల మరో జడ్జి దానిలో కొన్ని మార్పులు చేయాలన్నారని మంత్రి తెలిపారు.


More Telugu News