తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య పైపైకి!
- గత 24 గంటల్లో 38,362 కరోనా పరీక్షలు
- 482 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,048 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు 100కి అటూఇటూగా నమోదైన కొత్త కేసులు, ఇప్పుడు 400 దాటాయి. గడచిన 24 గంటల్లో 38,362 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 482 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 212 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,74,892 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,048కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 4,031కి పెరిగింది.