రానా చిన్నప్పటి ఫొటో పంచుకున్న ఖుష్బూ
- సోషల్ మీడియాలో ఖుష్బూ ఆసక్తికరమైన పోస్టు
- వార్డ్ రోబ్ లో ఫొటో దొరికిందని వెల్లడి
- వావ్ అంటూ స్పందించిన రానా
- ఖుష్బూకు కృతజ్ఞతలు
తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి అందాలతార ఖుష్బూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటో పంచుకుంది. ఆ ఫొటోలో విక్టరీ వెంకటేశ్ తో పాటు నటుడు దగ్గుబాటి రానా కూడా ఉన్నాడు. ఇది రానా చిన్నప్పటి ఫొటో. ఈ ఫొటో పోస్టు చేసిన ఖుష్బూ... "హేయ్ జూనియర్, నా వార్డ్ రోబ్ లో ఏం దొరికిందో చూడు! ఇలాంటివి మాకెంతటి మధుర జ్ఞాపకాలో కదా!" అంటూ రానాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
ఖుష్బూ పోస్టుపై రానా "వావ్ వావ్" అంటూ స్పందించాడు. సీనియర్ నటికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాడు. తెలుగులో వెంకటేశ్ తొలిచిత్రం 'కలియుగ పాండవులు'. ఈ సినిమాలో ఖుష్బూనే హీరోయిన్. ఆమెకు కూడా ఇదే మొదటి చిత్రం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్టయింది. ఆ తర్వాత వెంకటేశ్, ఖుష్బూ 'భారతంలో అర్జునుడు' అనే మరో చిత్రంలోనూ నటించారు.