లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... మళ్లీ నిరాశపర్చిన పుజారా, రహానే
- జోహాన్నెస్ బర్గ్ లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- టాపార్డర్ విఫలం
- డువానే ఒలీవియర్ కు రెండు వికెట్లు
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు పరిస్థితులు కలిసిరాలేదు. తొలిరోజు ఆటలో లంచ్ వేళకు 3 వికెట్లు చేజార్చుకున్న టీమిండియా 53 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ వికెట్ మార్కో జాన్సెన్ ఖాతాలో చేరింది.
ఆ తర్వాత వచ్చిన ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే మరోసారి నిరాశపరిచారు. ఇప్పటికే జట్టులో తమ స్థానాలు ప్రశ్నార్థకం చేసుకున్న వీరిద్దరూ పేలవంగా అవుటై విమర్శకులకు పని కల్పించారు. పుజారా 3 పరుగులు చేయగా, రహానే ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు డువానే ఒలీవియర్ కు దక్కాయి. ప్రస్తుతం క్రీజులో తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 19, హనుమ విహారి 4 పరుగులతో ఆడుతున్నారు.