మీ టీనేజీ పిల్లలకు ఇవ్వతగిన స్మార్ట్ కార్డులు ఇవిగో!

  • ప్రముఖ బ్యాంకుల నుంచి ప్రీపెయిడ్ కార్డులు
  • కావాల్సినంత లోడ్ చేసుకోవచ్చు
  • ఖర్చులపై పరిమితులకూ అవకాశం
  • దేనికి ఖర్చు చేస్తున్నారో ట్రాక్ చేసుకోవచ్చు
పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం నేడు సాధారణమైపోయింది. హైస్కూల్, కాలేజీ విద్యార్థులకు కచ్చితంగా పాకెట్ మనీ ఉండాల్సిందే. కానీ, తల్లిదండ్రులకు ఈ విషయంలో ఆందోళన కూడా ఉంటుంది. పిల్లలు ఎలా వినియోగిస్తారు? దేనికి ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే అవకాశం లేక ఆందోళన చెందే వారు చాలా మందే ఉన్నారు.

కనుక పిల్లలకు నగదుకు బదులు వారి అవసరాల కోసం (పాకెట్ మనీ) ఒక స్మార్ట్ కార్డు ఇస్తే బాగుంటుందన్నది చాలామంది అభిప్రాయం. స్మార్ట్ కార్డ్ తో వారి ఖర్చులన్నింటినీ ట్రాక్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. వినియోగం హద్దు మీరకుండా కట్టడి చేయవచ్చు. ఇందుకు వీలుగా అనువైన ఫీచర్లతో ఇవి వస్తున్నాయి. సొంత కాళ్లపై నిలబడడానికి ముందే వారిని వినియోగం విషయంలో స్మార్ట్ గా తయారు చేయడానికి ఈ కార్డులతో అవకాశం ఉంటుంది.

ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కిడ్స్ కోసం కోబ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డు ‘ఫ్యామ్ కార్డ్’ను ఆఫర్ చేస్తోంది. ఈ కార్డును ఫ్యామ్ పే యాప్ పై యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్యామ్ కార్డు ఎంఈ, ఫ్యామ్ కార్డు అని రెండు రకాలున్నాయి. వీటికి రూ.299, రూ.99 ఒక్కసారి చార్జీ చెల్లిస్తే చాలు. అదనంగా ఎటువంటి ఫీజులు, చార్జీల్లేవు. కనీస బ్యాలన్స్ కూడా అవసరం లేదు.

యస్ బ్యాంకు భాగస్వామ్యంతో ఎఫ్ వైపీ అనే ఫిన్ టెక్ సంస్థ కూడా ప్రీపెయిడ్ కార్డును అందిస్తోంది. ఖాతా ప్రారంభానికి ఎటువంటి చార్జీ లేదు. ప్రతీ లావాదేవీపై రివార్డులు కూడా లభిస్తాయి. ఎఫ్ వైపీ యాప్ లోని ఎన్నో వీడియోలు, క్విజ్ లు, కంటెంట్ తో ఆర్థిక నైపుణ్యాలను పెంచుకునే వీలుంది.

ఆర్ బీఎల్ బ్యాంకు, జునియో భాగస్వామ్యంతో స్మార్ కార్డ్ ను ఇస్తోంది. ఈ కార్డుతో పిల్లలు ఆఫ్ లైన్, ఆన్ లైన్ లోనూ లావాదేవీలు చేసుకోవచ్చు. వర్చువల్ కార్డు ఉచితం, ఫిజికల్ కార్డుకు రూ.99 చెల్లిస్తే చాలు. యూపీఐ సాయంతో కార్డులో బ్యాలన్స్ లోడ్ చేసుకుంటే 2 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కార్డుతో ఖర్చు చేస్తే (స్వైప్) 3 శాతం క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.

డీసీబీ బ్యాంకు, వీసా భాగస్వామ్యంతో స్లోంకిట్ అనే సంస్థ ప్రీపెయిడ్ కార్డును ఇస్తోంది. కార్డు ఏదైనా తల్లిదండ్రులుగా పరిమితి ముందే నిర్దేశించి ఇవ్వాలి. చెప్పినట్టుగా వినియోగిస్తేనే కార్డు ఉంటుందని, లేదంటే రద్దయిపోతుందని వారిని సున్నితంగా హెచ్చరించొచ్చు.


More Telugu News