అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్
- రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ కు కరోనా పాజిటివ్
- ఐదు రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండనున్న ఆస్టిన్
- రెండు వ్యాక్సిన్ డోసులు, ఒక బూస్టర్ డోస్ వేయించుకున్న రక్షణ మంత్రి
అమెరికాను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. తనలో కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు తాను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటానని తెలిపారు.
తాను రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోసును కూడా వేసుకున్నానని... అందుకే కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని... ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు వేయించుకోవాలని కోరారు.
ప్రెసిడెంట్ జో బైడెన్ ను డిసెంబర్ 21న తాను చివరిసారిగా కలిశానని ఆస్టిన్ చెప్పారు. అన్ని కీలక సమావేశాలకు, చర్చలకు తాను వర్చువల్ గా హాజరవుతానని తెలిపారు.