అది ఓ కళాఖండమండీ బాబూ: బాలయ్యతో రవితేజ

  • 'అన్ స్టాపబుల్' వేదికపై రవితేజ
  • బాలయ్యతో కలిసి సరదాల సందడి
  • 'అమర్ అక్బర్ ఆంటోని' ప్రస్తావన
  • తనదైన స్టైల్లో మాట్లాడిన రవితేజ
రవితేజ నుంచి ఆ మధ్య వరుస ఫ్లాపులు వచ్చాయి. ఆ సమయంలో ఆయన పారితోషికం తగ్గించుకోవలసిందేననే డిమాండ్ నిర్మాతల నుంచి వినిపించింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనను మరింత ప్రమాదంలోకి నెట్టిన సినిమా 'అమర్ అక్బర్ ఆంటోని'. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.

బాలయ్య టాక్ షో 'అన్ స్టాపబుల్'లో రవితేజ పాల్గొన్నాడు. అప్పుడు బాలకృష్ణ .. రవితేజ యూఎస్ లో ఉన్న ఒక ఫొటోను స్క్రీన్ పై చూపించి దాని గురించి చెప్పమని అడిగారు. అప్పుడు రవితేజ .. "ఈ ఫొటో అమెరికాలో తీసింది .. ఓ కళాఖండం లాంటి సినిమా షూటింగు సమయంలో. ఆ కళాఖండం పేరు తెలుసుకోవాలని ఉందా మీకు .. 'అమర్ అక్బర్ ఆంటోని' అని చెప్పాడు.

ఇందులో నువ్వు అమరా? అక్బరా? ఆంటోనీనా? అని బాలయ్య అడగ్గా, "ఆ మూడూనూ .. ఆ సినిమా చూడలేదా మీరూ. మీరేం మిస్సయిపోలేదు .. చూడక్కర్లేదు"అని రవితేజ సమాధానమిచ్చాడు. 'నీ కోసం', 'వెంకీ', 'దుబాయ్ శీను' వంటి హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల సినిమా గురించి రవితేజ అలా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారిపోయింది.


More Telugu News