ఈ అహంకార పాలన మనకొద్దు: షర్మిల
- ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్స్ రాక ఆత్మహత్యలు
- రైతుల చావులతో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారింది
- ఆదుకోకుండా అధికారముందనే అహంకారంతో తమాషా చూస్తున్నాడు
- 'నిరుద్యోగుల హంతకుడు.. రైతుల హంతకుడు' అంటూ షర్మిల విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వాన పడ్డట్లు కేసీఆర్‌లో చలనమే లేదని ఆమె అన్నారు.
'ఈ రోజు ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్స్ రాక నిప్పంటించుకుని ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వాన పడ్డట్లు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు రైతుల చావులతో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారితే దొర గారు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా, రైతులను ఆదుకోకుండా అధికారముందనే అహంకారంతో తమాషా చూస్తున్నాడు' అని షర్మిల విమర్శలు గుప్పించారు.
'నిరుద్యోగుల హంతకుడు.. రైతుల హంతకుడు.. ఉద్యోగుల చావులకు కారకుడు కేసీఆర్ గారు. ఉద్యోగాలు ఇవ్వని, రైతుల చావులను ఆపని, ఉద్యోగుల చావులకు కారణమయ్యే అహంకార పాలన మనకొద్దు. కేసీఆర్ అధికారాన్ని కూల్చేస్తేనే రాష్ట్రంలో చావులు ఆగిపోతాయి' అని షర్మిల ట్విట్టర్‌లో పేర్కొన్నారు.