ఢిల్లీకి బయల్దేరిన ఏపీ సీఎం జగన్
- సాయంత్రం 4 గంటలకు మోదీతో భేటీ
- పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరనున్న జగన్
- అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు పయనమయ్యారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించనున్నారు. వీటిని వెంటనే పరిష్కరించాలని విన్నవించనున్నారు. పెండింగ్ అంశాలలో ఆర్థికలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, ప్రత్యేకహోదా తదితర అంశాలు ఉన్నాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, విమానయానశాఖ మంత్రులను జగన్ కలవనున్నారు. మరోవైపు ఇప్పటికే విజయసాయిరెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. జగన్ తో పాటు పలువురు ఎంపీలు, అధికారులు ఢిల్లీకి వెళ్లారు.