అప్పు చేసిన ఆ రూ. 3 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పండి: ఎంపీ కేశినేని నాని డిమాండ్
- విస్సన్నపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేశినేని నాని
- జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు అంగుళం కూడా ముందుకు కదలలేదు
- విస్సన్నపేట బైపాస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా
- కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. విస్సన్నపేటలో ఏవీ చౌదరి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించిన ఎంపీ అనంతరం మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం, పిట్టలవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో మాట్లాడి విస్నన్నపేట బైపాస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేస్తామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు.