ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమన్న చంద్రబాబు
- తాము ఐదేళ్లూ అధికారంలో ఉంటామన్న మిథున్ రెడ్డి
- పార్టీని కాపాడుకునేందుకేనంటూ చంద్రబాబుపై విమర్శలు
- తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు
ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంపై వైసీపీ యువ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ తాము అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలోని ఓ హోటల్ రూపొందించిన యాప్ ను ఆవిష్కరించారు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం తెలిసిందే. రాష్ట్రంలో మళ్లీ 2024లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపాలంటూ ప్రధాని మోదీ అభిలషిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.