వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి
- వైకుంఠద్వార దర్శనం తేదీలు ప్రకటించిన టీటీడీ
- ఈ నెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార దర్శనం
- సిఫారసు లేఖలు తీసుకోబోమన్న వైవీ సుబ్బారెడ్డి
- నందకం, వకుళమాత భవనంలో గదుల కేటాయింపు
తిరుమల పుణ్యక్షేత్రానికి సంక్రాంతి సీజన్ లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ సీజన్ లో వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. స్వామివారి దర్శనానికి ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈసారి జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) వెల్లడించింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈసారి వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠద్వార దర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు.
వీఐపీలకు నందకం, వకుళమాత వసతి భవనంలో గదులు కేటాయిస్తామని వెల్లడించారు. తిరుమలలో గదులు లభ్యం కాకపోతే తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మరమ్మతు పనుల వల్ల గదుల కొరత ఉందని అన్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లు గలవారు తిరుపతిలో గదులు తీసుకోవాలని సూచించారు.