కేటీఆర్ ఆర్థిక సాయంతో నేపాల్ వెళ్లి స్వర్ణం సాధించిన తెలంగాణ కుర్రాడు
- మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తున్న బొలుగుల చందు
- గోవాలో జరిగిన నేషనల్ టోర్నీలో రాణించిన వైనం
- నేపాల్ లో ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొనే చాన్స్
- ఆర్థికసాయం కోసం విన్నపం
- స్పందించి సాయం చేసిన కేటీఆర్
- నేపాల్ టోర్నీలో చాంపియన్ గా నిలిచిన చందు
జనగామ జిల్లా బచ్చన్నపేట నివాసి బొలుగుల చందు (19) ఓ మార్షల్ ఆర్ట్స్ వీరుడు. ఎనిమిదేళ్ల పిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ లో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తూ, అంచెలంచెలుగా జాతీయస్థాయికి ఎదిగాడు. గోవాలో జరిగిన నేషనల్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో నేపాల్ లో అంతర్జాతీయ చాంపియన్ షిప్ లో పాల్గొనే అవకాశం చందుకు లభించింది. కానీ చందు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ దశలో మంత్రి కేటీఆర్ కు చేసిన విజ్ఞప్తి ఫలితాన్నిచ్చింది.
చందు పరిస్థితిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. అతడు నేపాల్ వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. దాంతో చందు ఎంతో ఉత్సాహంగా నేపాల్ వెళ్లి టోర్నీలో పాల్గొనడమే కాదు, వివిధ దేశాల పోరాట యోధులను ఓడించి విజేతగా నిలిచాడు.
ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ, తాను ఈ టోర్నీలో పాల్గొనడానికి కారణం మంత్రి కేటీఆర్ అందించిన ఆర్థికసాయమేనని వినమ్రంగా తెలిపాడు. రాణిస్తానన్న నమ్మకంతో టోర్నీ బరిలో దిగానని, పసిడి పతకం సాధించడం ఎంతో సంతోషం కలిగించిందని వెల్లడించాడు. మున్ముందు మరిన్ని పతకాలు తీసుకువస్తానని, దేశం, రాష్ట్రం గర్వించేలా చేస్తానని చెప్పాడు. చందు ప్రస్తుతం వరంగల్ లోని సైనిక్ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు.