మూడు రాజధానులు, తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై రేపు ప్రధాని మోదీతో జగన్ సమావేశం

  • రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం
  • హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ
  • పోలవరం సవరణ అంశాలపై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, విభజన హామీలతో పాటు మరికొన్ని కీలకాంశాలపై వారితో చర్చించనున్నారు. ఇప్పటికే వారిద్దరి అపాయింట్ మెంట్ ను జగన్ తీసుకున్నారని సమాచారం.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా సానుకూల నిర్ణయం మాత్రం రాలేదు. ఈ పర్యటనలోనైనా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్ పై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News