కీలక నిర్ణయం తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
- డిసెంబర్ 31న బోర్డు సమావేశం
- ఓవర్సీస్ బాండ్లపై చర్చలు
- 500 కోట్ల డాలర్ల విలువ చేసే బాండ్లను జారీ చేయాలని నిర్ణయం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది. రిలయన్స్ డిసెంబర్ 31న ఓ సమావేశం నిర్వహించి, ఓవర్సీస్ బాండ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. 500 కోట్ల డాలర్ల విలువ చేసే బాండ్లను జారీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ ఇందుకు సంబంధించిన వివరాలు పేర్కొంది.
భారత చట్టాలకు లోబడి యూఎస్ డాలర్ డినామినేషన్ కలిగి ఉండి ఫిక్స్‌డ్ రేట్ గల సీనియర్ అన్‌సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు చెప్పింది. అయితే, బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం రిలయన్స్ ఇప్పటివరకు తెలపలేదు. తమ బోర్డు తీసుకున్న నిర్ణయం.. ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ఉపయోగించాలని రిలయన్స్ భావిస్తున్నట్లు సమాచారం.