'సానా కష్టం' అంటూ చిరు డ్యాన్స్ అదుర్స్.. 'ఆచార్య' పాట ప్రోమో విడుదల
- కొరటాల దర్శకత్వంలో ఆచార్య
- ఇప్పటికే రెండు పాటలు హిట్
- రేపు సానా కష్టం పూర్తిపాట విడుదల
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఆచార్య’ చిత్రంలోని 'సానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..' అంటూ ఈ పాట కొనసాగుతోంది. మణిశర్మ అందించిన సంగీతం అలరిస్తోంది. చిరంజీవి అభిమానుల్లో జోష్ పెంచేలా ఈ పాట ఉంది.
ఈ గీతాన్ని రేపు విడుదల చేయనున్నట్టు ఈ సినిమా బృందం ప్రకటించింది చిత్రబృందం. ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో రామ్ చరణ్, పూజ హెగ్డే కూడా నటిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'లాహె లాహె', 'నీలాంబరీ' పాట ప్రేక్షకులను అలరించాయి. అదే జోష్‌ను కొనసాగిస్తూ సానా కష్టం పాట విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్వకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో గిరిజనుల బతుకు చిత్రాలను కళ్లకు కట్టేలా చూపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రోమోల ద్వారా స్పష్టమైంది. లాహె లాహె పాట కూడా గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించేలా తీశారు.
చిరంజీవి వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఆయన నటిస్తోన్న భోళా శంకర్ సినిమాకు సంబంధించి నిన్న న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.