స్త్రీని ‘శృంగార వస్తువు’గా చూడొద్దని కుమారులకు నేర్పాలి: కథానాయిక సమంత
- శృంగారంగా కనిపించొద్దని కుమార్తెలకు చెప్పడం కాదు
- అలా చేయడం వారి హక్కును కాదనడమే
- ఇన్ స్టా గ్రామ్ లో ఫరీదా కొటేషన్ షేర్
- దీనికి నిజమేనంటూ షేర్ చేసిన సమంత
వైవాహిక జీవితంలో ఎడబాటును చూసిన నటి సమంత.. అబ్బాయిల విషయంలో తల్లిదండ్రుల వైఖరి గురించి కీలకమైన వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ ను షేర్ చేసింది. పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’ అంటూ అందాల ఆరబోతతో అభిమానులను అలరించిన ఈ భామ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఫరీదా డీ కొటేషన్ ను షేర్ చేసింది. అది ఇప్పుడు ఎంతో వైరల్ గా మారిపోయింది.
‘‘శృంగారంగా కనిపించొద్దని మీ కుమార్తెలకు చెప్పే బదులు.. మహిళను శృంగార వస్తువుగా చూడొద్దంటూ మీ కుమారులకు బోధించండి. ఎందుకంటే మీ కుమార్తె లైంగిక హక్కును కాదనడం.. ఆమెను మరో మార్గంలో ఆక్షేపించడమే అవుతుంది’’ అన్నది ఆ కొటేషన్ సారాంశం. దీనికి ‘యస్’ (అవును) అంటూ సమంతా తలూపింది. తన ఇన్ స్టా గ్రామ్ లో ఫరీదా కొటేషన్ ను ఫాలోవర్లతో పంచుకుంది.
ఏ విషయంలోనైనా సమంత తన అభిప్రాయాలను చెప్పేందుకు ఏ మాత్రం సంకోచించదని తెలిసిందే. నాగచైతన్యతో బంధానికి తెగతెంపులు పలికిన తర్వాత సామాజిక మాధ్యమ వేదికలుగా ఆమె ఎన్నో తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విమర్శల దాడితో సమంత మరింత బలం పెంచుకున్నట్టుగా కనిపిస్తోంది.