'వారి వల్లే ఇలా జరిగింది'.. బీసీసీఐ, ధోనీపై హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- నన్ను తీసేయకపోతే బాగుండేది
- టెస్టుల్లో మరో 100-150 వికెట్లు పడగొట్టేవాడిని
- క్రికెట్లో అదృష్టం ఎల్లప్పుడూ నావైపే ఉంది
- కొన్ని ఇతర అంశాలు మాత్రం నావైపు లేవు
టీమిండియా నుంచి తనను తప్పించిన తీరుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీసీసీఐ అధికారులు, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆయన మాట్లాడాడు. తనను తీసేయకపోతే టెస్టుల్లో తాను మరో 100-150 వికెట్లు పడగొట్టేవాడినని తెలిపాడు.
క్రికెట్లో అదృష్టం ఎల్లప్పుడూ తనవైపే ఉన్నప్పటికీ కొన్ని ఇతర అంశాలు మాత్రం తనవైపు లేవని ఆయన చెప్పాడు. తాను బౌలింగ్ చేస్తున్న విధానం, జట్టులో మరింత రాణిస్తోన్న తీరే అందుకు కారణమని ఆయన అనడం గమనార్హం. తాను 400 వికెట్లు తీసినప్పుడు తన వయసు 31 ఏళ్లు మాత్రమేనని ఆయన చెప్పాడు.
తాను జట్టులో మరో 4-5 ఏళ్లు కొనసాగితే మరో 100-150 వికెట్లు తీసేవాడినని చెప్పాడు. బీసీసీఐ నుంచి ఇతర ఆటగాళ్లకంటే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎక్కువ మద్దతు లభించిందని ఆయన చెప్పడం గమనార్హం. అప్పుడు ధోనీనే కెప్టెన్ గా ఉన్నాడని, అయితే, తనను జట్టుకు ఎంపిక చేసే అధికారం మాత్రం ధోనీ చేతుల్లోనూ లేదని తెలిపాడు.
కొందరు బీసీసీఐ అధికారులు కొంతవరకు ఇందులో జోక్యం చేసుకున్నారని, తాను జట్టులో ఉండడం వాళ్లకు ఇష్టం లేదని అన్నాడు. ధోనీ కూడా బీసీసీఐ పెద్దలకు ఈ విషయంలో మద్దతు ఇచ్చి ఉండొచ్చని తెలిపాడు. కెప్టెన్ ఎప్పుడూ బీసీసీఐ కంటే ఎక్కువ కాదని, బీసీసీఐ అధికారులే ఎల్లప్పుడూ కెప్టెన్ కన్నా కోచ్, జట్టు కన్నా ఎక్కువ అని ఆయన అన్నాడు.
బీసీసీఐ నుంచి ఇతర ఆటగాళ్ల కన్నా ధోనీకే ఎక్కువ మద్దతు లభించిందని చెప్పాడు. బీసీసీఐ మద్దతు లభించి ఉంటే ఇతర ఆటగాళ్లు కూడా చాలా కాలం ఆడేవారని ఆయన అన్నాడు. కాగా, ఇప్పటికే హర్భజన్ సింగ్ రిటైర్ అయిన విషయం తెలిసిందే.