అన్నట్టుగానే పదవి నుంచి తప్పుకున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి

  • డిసెంబరు 2021లో పదవి నుంచి తప్పుకుంటానని ఇది వరకే ప్రకటన
  • ఇకపై తన జీవితం సమాజ సేవకే అంకితమన్న సుధ
  • ఇప్పటికే సామాజిక సేవలో చురుగ్గా ఉన్న వైనం
2021 డిసెంబరు చివరిలో పదవి నుంచి వైదొలగుతానని గతంలో ప్రకటించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి అన్నట్టుగానే తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేస్తానని ప్రకటించారు. సుధామూర్తి ఇప్పటికే సామాజిక సేవలో చురుగ్గా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి ఫౌండేషన్ తరపున ఇప్పటి వరకు 2,300 ఇళ్లు, 16 వేల మరుగుదొడ్లను నిర్మించారు.

అలాగే తమిళనాడు, అండమాన్‌లో సునామీ, కచ్ భూకంపం, ఏపీ, ఒడిశాలో వరదల కారణంగా భారీ నష్టం సంభవించినప్పుడు బాధితులను ఆదుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన నిత్యవసరాలను సమకూర్చారు. కరోనా కష్టకాలంలోనూ లక్షల మందికి కిట్లు, ఔషధాలు సమకూర్చారు. కాగా, సుధామూర్తి రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు.


More Telugu News