మమ్మల్ని గెలిపిస్తే 300 యూనిట్ల విద్యుత్ ఉచితం.. అఖిలేశ్ యాదవ్ హామీల వర్షం

  • లక్నో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్
  • రైతులకు కూడా ఉచిత విద్యుత్
  • మేనిఫెస్టోలో చేరుస్తామన్న ఎస్పీ చీఫ్
  • నేడు లక్నోలో పర్యటించనున్న కేజ్రీవాల్
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే 300 యూనిట్ల గృహ విద్యుత్‌‌ను ఉచితంగా అందిస్తామని అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. లక్నోలో నిన్న నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్.. తమను గెలిపిస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తోపాటు, రైతులకు కూడా ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుస్తామన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇటీవల గోవాలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ నేడు లక్నోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉందని భావించారు. అంతలోనే అఖిలేశ్ యాదవ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News