మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగించిన భారత్, పాకిస్థాన్

  • అణుశక్తులుగా కొనసాగుతున్న భారత్, పాక్
  • భారత్ వద్ద 160 అణ్వస్త్రాలు
  • పాక్ వద్ద 165 అణ్వాయుధాలు
  • ఒకరి అణుకేంద్రాలపై మరో దేశం దాడి చేయబోదంటూ ఒప్పందం
  • 31వ పర్యాయం జాబితాల మార్పిడి
దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ రెండూ అణ్వస్త్ర శక్తులేనని తెలిసిందే. రెండు దేశాల వద్ద గణనీయ స్థాయిలో అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్ కంటే పాక్ వద్దే ఎక్కువ అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్ వద్ద 160 ఉండగా, పాక్ చేతిలో 165 ఉన్నాయి.

అయితే, ఒకరి దేశంలోని అణుకేంద్రాలపై మరొక దేశం దాడి చేయరాదని భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్, పాకిస్థాన్ వర్గాలు తమ దేశాల్లో ఉన్న అణు స్థావరాల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. గత 30 ఏళ్లుగా ఈ సంప్రదాయం అమల్లో ఉంది.

తాజాగా ఈ జాబితాల అందజేత కార్యక్రమంపై భారత విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దౌత్యమార్గాల ద్వారా ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపింది. అణు స్థావరాల జాబితాలను ఇచ్చిపుచ్చుకోవడం ఇది 31వ పర్యాయం అని పేర్కొంది.


More Telugu News