క్రిస్ గేల్ విన్నపాన్ని పట్టించుకోని వెస్టిండీస్ బోర్డు

  • సొంత మైదానంలో చివరి టీ20 ఆడాలనుకున్న గేల్
  • టీ20 జట్టుకు గేల్ ను ఎంపిక చేయని బోర్డు
  • తీవ్ర నిరాశకు గురైన గేల్
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కు అవమానం జరిగింది. తన టీ20 కెరీర్ కు సొంతగడ్డపై వీడ్కోలు పలకాలని గేల్ భావించాడు. ఇదే విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. అయితే త్వరలో ఇంగ్లండ్, ఐర్లాండ్ లతో జరగనున్న టీ20 సిరీస్ లకు ఎంపిక చేసిన జట్టులో గేల్ కు స్థానం కల్పించకుండా ఆయన కోరికను బోర్డు బేఖాతరు చేసింది.

ఇప్పటికే వన్డేలు, టెస్టులకు గేల్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ సందర్భంగా గేల్ మాట్లాడుతూ... తన సొంత మైదానమైన సబీనా పార్క్ లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెపుతానని అన్నాడు. అయితే విండీస్ బోర్డు టీ20 జట్టులో స్థానం కల్పించకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, తన భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.


More Telugu News