తెలంగాణలో రూ.172 కోట్లు, ఏపీలో రూ.124 కోట్లు... డిసెంబరు 31న వెల్లువెత్తిన మద్యం విక్రయాలు!

  • 2022కి స్వాగతం పలుకుతూ జోరుగా మద్యపానం
  • డిసెంబరు 31న రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
  • అర్ధరాత్రి దాకా తెరిచివున్న వైన్ షాపులు
  • ఏపీలో అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు 
కొత్త సంవత్సరాదికి స్వాగతం పలికే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక్కరోజులోనే తెలంగాణ, ఏపీ ఎక్సైజ్ శాఖలకు భారీ ఆదాయం వచ్చిపడింది. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించడం కూడా కలిసొచ్చింది. డిసెంబరు 31న తెలంగాణలో 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మొత్తం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.

ఏపీలోనూ ఇదే తీరు కనిపించింది. మద్యం ప్రియులు నిన్న 1.36 లక్షల కేసుల లిక్కర్, 53 వేల కేసుల బీర్లు కొనుగోలు చేశారు. మొత్తం రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. ప్రీమియం బ్రాండ్లు కూడా అమ్మకానికి ఉంచడంతో ఏపీలో మందుబాబులు వైన్ షాపులకు పోటెత్తారు.


More Telugu News