'మన ఊరికే కాదు.. నువ్వు ఈ దేశానికే సర్పంచ్ కావాలి' అంటున్న చైతూ... 'బంగార్రాజు' టీజర్ ఇదిగో
- నూతన సంవత్సర కానుకగా విడుదల
- ఒకే ఫ్రేమ్ లో సందడి చేసిన తండ్రీకొడుకులు
- సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు సినిమా
బంగార్రాజు టీజర్ వచ్చేసింది. ఇవాళ నూతన సంవత్సర కానుకగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్యలు ఒకే ఫ్రేమ్ లో తళుక్కున మెరిశారు. బంగార్రాజుగా కింగ్ నాగార్జున మీసం మెలేస్తే.. తన సత్తా చూపించేందుకు చైతూ సిద్ధమయ్యాడు.
రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నాగ్, చైతూలకు జోడీగా నటిస్తున్నారు. ప్రత్యేక గీతంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడింది. ‘‘నువ్వు మన ఊరికే సర్పంచ్ కాదు.. మన రాష్ట్రానికి, మన దేశానికే సర్పంచ్ కావాలి’’ అంటూ కృతితో చైతూ చెప్పే సంభాషణలు నవ్వించేలా ఉన్నాయి. ‘‘లయకారుడి సన్నిధిలోనే అపశ్రుతి. కలి మాయకాకపోదు’’ అంటూ యముడి పాత్రలో నాగబాబు చెప్పే డైలాగ్ లూ ఆకట్టుకున్నాయి. ఫైట్ సీన్స్ తీవ్రత కూడా ఓ రేంజ్ లోనే ఉంది.
కల్యాణ కృష్ణ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.