పేదల కోసం సినిమా టికెట్ ధరలు తగ్గించాం: ఏపీ సీఎం జగన్
- దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు
- ఇలాంటి విమర్శలు చేస్తున్న వాళ్లంతా పేదల వ్యతిరేకులు
- పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడకూడదనే జ్ఞానం లేదు
- వారికి జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడి కోరుకుంటున్నాను
సినిమా టికెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు, థియేటర్లలో తనిఖీలు చేయడం, వాటిని సీజ్ చేస్తుండడంతో తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా విమర్శలపై మంత్రులు మాత్రమే స్పందించారు.
ఈ క్రమంలో ఈ రోజు వైఎస్సార్ పింఛను కానుక పథకం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జగన్ ప్రారంభించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా టికెట్ల విషయంలో వస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు.
పేదల కోసం సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని జగన్ అన్నారు. ఇలాంటి విమర్శలు చేస్తున్న వాళ్లంతా పేదల వ్యతిరేకులని ఆయన అన్నారు. పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడకూడదనే జ్ఞానాన్ని ఇలాంటి వాళ్లకు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మంచి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని, ఇటువంటి వారూ ఉంటారని ఆయన అన్నారు.