చేసిన తప్పుకు మళ్లీ 'ఇంకో ఛాన్స్' ఇవ్వకుండా మార్పును ఆహ్వానించాలి: నారా లోకేశ్

  • మన ఆలోచనలు తప్పుదారి పట్టించి ఉండవచ్చు
  • మన బలహీనతల వల్ల మోసపోయి ఉండవచ్చు
  • అలాగని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు
  • ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలన్న లోకేశ్  
చేసిన తప్పుకు మళ్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా మార్పును ఆహ్వానించాలి అంటూ ప్ర‌జ‌లకు సూచిస్తూ, ప‌రోక్షంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పారు.

'గడచిన కాలంలో మన ఆలోచనలు, నమ్మకాలలో కొన్ని మనల్ని తప్పుదారి పట్టించి ఉండవచ్చు. మన బలహీనతల వల్ల మోసపోయి ఉండవచ్చు. అలాగని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతూ ఉండాలి. చేసిన తప్పుకు మళ్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా మార్పును ఆహ్వానించాలి' అని లోకేశ్ సూచించారు.

'కాలంతోపాటు కళ్లు మూసుకుని వెళ్ల‌కండి. రేపటి రోజు నాదే అన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే, ముందున్న కాలం మనం చెప్పినట్టుగా నడుస్తుంది. కొత్త ప్రగతిని ఇస్తుంది. కొత్త సంవత్సరం మీ జీవితానికి శుభాలను పంచాలని ఆశిస్తూ... మీ ఇంటిల్లి పాదికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు


More Telugu News