దేశంలో భారీగా పెరిగిపోయిన రోజూవారీ కరోనా కేసులు
- నిన్న 22,775 కేసులు
- 406 మంది మృతి
- యాక్టివ్ కేసులు 1,04,781
- ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1,431
దేశంలో రోజూవారీ కరోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మొన్న 16,764 కేసులు నమోదు కాగా, నిన్న 22,775 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలు తెలుపుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి 8,949 మంది కోలుకున్నారు.
అలాగే, నిన్న ఒక్కరోజులో 406 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు 1,04,781 మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1,431కు పెరిగింది.