ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇకపై బ్రాండెడ్ మద్యం విక్రయాలు!
- ప్రస్తుతం ఊరుపేరు లేని బ్రాండ్ల విక్రయం
- పాప్యులర్ బ్రాండ్ల విక్రయానికి ఏపీఎస్‌బీసీఎల్ కసరత్తు
- వీలైనంత త్వరగా అందుబాటులోకి!
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు ఇది శుభవార్తే. ముక్కూమొహం తెలియని బ్రాండ్ల స్థానంలో ఇకపై బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో ఈ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీఎస్‌బీసీఎల్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా బ్రాండెడ్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం.