దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం నమోదు

  • భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి
  • రాజస్థాన్ లో 73 ఏళ్ల వృద్ధుడి మృతి
  • కరోనా నెగెటివ్ వచ్చినా న్యూమోనియాతో మరణం
  • గత మంగళవారం మహారాష్ట్రలో ఓ వ్యక్తి మృతి
భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,200 దాటిన నేపథ్యంలో, దేశంలో ఒమిక్రాన్ కారణంగా రెండో మరణం చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్ తో కన్నుమూశాడు. డిసెంబరు 15న కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతడి నుంచి సేకరించిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్ అని వెల్లడైంది.

అతడికి డిసెంబరు 22న కొవిడ్ నెగెటివ్ అని వచ్చినా, కరోనా అనంతర న్యూమోనియాతో మరణించినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ దినేశ్ ఖరాడీ తెలిపారు. ఆ వృద్ధుడికి మధుమేహం, రక్తపోటు, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉన్నాయని వివరించారు. రాజస్థాన్ లో ఇదే తొలి ఒమిక్రాన్ మరణం కాగా, దేశంలో రెండోది. మహారాష్ట్రలో గత మంగళవారం తొలి మరణం నమోదు కావడం తెలిసిందే.


More Telugu News