తెలంగాణలో 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ల రేట్లు ఇవిగో!
- తెలంగాణలో థియేటర్లకు వెసులుబాటు
- టికెట్ల వివరాలు తెలిపిన ఫిలించాంబర్
- సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.175
- మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ.295
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్ల వివరాలను తెలంగాణ ఫిలించాంబర్ వెల్లడించింది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం టికెట్ ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.175, మల్టీప్లెక్స్ ల్లో రూ.295 ఉంటుందని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ కష్టాలను అర్థం చేసుకుని మద్దతుగా నిలుస్తూ పలు చర్యలు తీసుకుందని 'ఏషియన్ సినిమాస్' అధినేత సునీల్ నారంగ్ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తున్నట్టు తెలిసిందని, వారందరికీ తాము ఫోన్ ద్వారా హితవు పలికామని వెల్లడించారు. వారు కూడా రేపటి నుంచి టికెట్ల రేట్లు తగ్గిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే సమయంలో, చిన్న సినిమాల టికెట్ రేట్లు తక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, తాజాగా ప్రకటించిన 'ఆర్ఆర్ఆర్' టికెట్ల రేట్లు రెండు వారాల వరకు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత తగ్గుతాయని ఫిలించాంబర్ ప్రతినిధులు పేర్కొన్నారు.