పుష్పలో తొలగించిన సన్నివేశం ఇదే.. షేర్ చేసిన చిత్ర బృందం.. ఇదిగో వీడియో
- అప్పు తీర్చవా అంటూ పుష్ప తల్లిపై రెడ్డప్ప అనే వ్యాపారి ఆగ్రహం
- మరునాడే పశువులమ్మి అప్పు తీర్చేసే పుష్ప
- తన లెక్క సరిచేయవా? అంటూ వ్యాపారితో ఊరంతా అప్పు తీర్చేసినట్టు చెప్పించే సీన్
అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. అయితే, సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు. అందులో ఓ సన్నివేశాన్ని తాజాగా చిత్రం యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఆ తొలగించిన సీన్ ను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది.
కుటుంబం కోసం తీసుకున్న అప్పును తీర్చడానికి సంబంధించిన సన్నివేశం అది. రెడ్డప్ప అనే వ్యక్తి వద్ద పుష్ప తల్లి అప్పుగా కొంత డబ్బు తీసుకుంటుంది. ఆ అప్పును తీర్చలేదంటూ రెడ్డప్ప.. అందరి ముందు అవమానిస్తాడు. ‘‘భారతమ్మ, ఎంతకాలం తప్పించుకుంటావ్. పోయిన గంగ జాతరకు ఇస్తి. ఇప్పటిదాకా అసలు లేదు.. వడ్డీ లేదు’’ అని రెడ్డప్ప నిలదీస్తే.. పుష్ప మిల్లులో పనికి కుదిరాడు.. త్వరలోనే తీర్చేస్తామని పుష్ప తల్లి బదులిస్తుంది. అయితే, ఎక్కడా పనిచేయట్లేదంటూ రెడ్డప్ప చెప్పగానే.. పుష్ప తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఆ మరుసటి రోజే పశువులను అమ్మేసి వడ్డీతో సహా అప్పు తీర్చేస్తాడు పుష్ప. ‘‘నీ లెక్క సరిపోయింది సరే.. మరి నా లెక్క. మేము అప్పు తీసుకున్నామని ఊరంతా తెలిసింది. తీర్చేశామని ఊరంతా తెలియవద్దా?’’ అని బన్నీ అంటాడు. ఊరందరికీ అప్పు తీర్చేశాడంటూ చెప్పిస్తాడు. ఇదిగో ఆ సన్నివేశాన్ని మీరూ చూసేయండి మరి.