‘ఆర్ఆర్ఆర్’.. టైటిల్ గురించి వివరించిన రాజమౌళి
- ‘కపిల్ శర్మ షో’లో జక్కన్న, తారక్, చరణ్, ఆలియా సందడి
- ఆ కార్యక్రమంలోనే టైటిల్ సీక్రెట్ ఏంటో చెప్పిన రాజమౌళి
- ముందుగా తమ పేర్లతోనే ట్యాగ్ ఇచ్చామన్న జక్కన్న
- అన్ని భాషల్లో మంచి స్పందన రావడంతో అదే ఫిక్స్ చేశామని వెల్లడి
ఆర్ఆర్ఆర్.. జనవరి 7న ప్రేక్షకులకు ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అయిపోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో చిత్రం యూనిట్ బిజీబీజీగా గడుపుతోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి టైటిల్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది. టైటిల్ పై మొదట్లో కాంపిటీషన్ కూడా పెట్టారు. అయితే, తాజాగా సినిమా టైటిల్ పై డైరెక్టర్ రాజమౌళి స్పష్టతనిచ్చారు. టైటిల్ వెనుకున్న విషయాన్ని వివరించారు. ఇటీవల ‘కపిల్ శర్మ షో’లో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ తో పాటు రాజమౌళి పాల్గొన్నారు.
ఆ షోలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో జక్కన్న చెప్పారు. ‘‘సినిమా మొదలుపెట్టినప్పుడు ఏ పేరు పెట్టాలో తెలియలేదు. మేం ముగ్గురం కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసినప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ అనే ట్యాగ్ ఇచ్చాం. ముగ్గురి పేర్లు కలిసేలా ట్యాగ్ చేశాం. సోషల్ మీడియాలో ఆ పేరుతోనే అప్ డేట్స్ ఇచ్చాం. అన్ని భాషల నుంచి ‘ఆర్ఆర్ఆర్’కు మంచి స్పందన రావడంతో ఇక అదే పేరుతో ముందుకు వెళ్లాం. అయితే, మా ముగ్గురు పేర్లు అని అర్థం వచ్చేలా కాకుండా.. ‘రణం, రౌద్రం, రుధిరం’ అనే కన్ఫర్మ్ చేశాం’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.