బెంగళూరులో కరోనా విజృంభణ.. రాష్ట్రం మొత్తంమీద 80 శాతానికి పైగా కేసులు ఇక్కడే!
- 707 కొత్త కేసుల్లో బెంగళూరు నుంచి 565
- కొడగులో ఒక శాతం దాటిన పాజిటివ్ రేటు
- 2-3 నెలల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుందని అంచనా
- కేసులు పెరిగినప్పటికీ ఐసీయూలో చేరేవారు తక్కువే
బెంగళూరు నగరంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద గురువారం 707 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇందులో 565 కేసులు బెంగళూరులో నమోదైనవే. రాష్ట్రం మొత్తం మీద యాక్టివ్ కేసుల సంఖ్య 8,223కు పెరిగింది. 47 రోజుల్లోనే ఇది గరిష్ఠ స్థాయి. ఇందులో 83 శాతం అంటే 6,846 కేసులు బెంగళూరులో ఉన్నాయి.
కేసులు కచ్చితంగా పెరుగుతున్నాయని బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు ప్రకటించారు. పరీక్షల సంఖ్యను పెంచినట్టు చెప్పారు. వచ్చే 10 రోజులు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని బీబీఎంపీ చీఫ్ హెల్త్ ఆఫీసర్ ఏఎస్ బాలసుందర్ తెలిపారు. యాక్టివ్ కేసుల్లో అధిక శాతం లక్షణాల్లేనివేనని చెప్పారు. ఐసీయూలో చేరే కేసుల సంఖ్యలో పెరుగుదల లేదని తెలిపారు. ఒక్క కొడగులో పరీక్షల సంఖ్యతో పోలిస్తే పాజిటివ్ రేటు 1 శాతం దాటిపోయింది.
‘‘మునుపటి పరిస్థితే మళ్లీ పునరావృతం కానుంది. 2020, 2021లో చూసినట్టుగానే వైరస్ బయోలాజికల్ సర్కాడియన్ సైకిల్ కనిపిస్తోంది. కనుక 2-3 నెలల్లో డెల్టా వేరియంట్ ను ఒమిక్రాన్ పూర్తిగా భర్తీ చేస్తుంది’’అని కోవిడ్ సాంకేతిక నిపుణుల కమిటీకి చెందిన డాక్టర్ సీఎన్ మంజునాథ్ పేర్కొన్నారు.