ఇప్పుడు నల్గొండ వంతు.. 'ఐటీ హబ్'పై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

  • ఐటీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
  • ఇవాళ శంకుస్థాపన చేయనున్న మంత్రి
  • 18 నెలల్లో కార్యకలాపాల ప్రారంభం
మొన్నమొన్నటిదాకా ఐటీ (సాఫ్ట్ వేర్ రంగం) అంటే హైదరాబాద్ మాత్రమే అనేట్టు ఉండేది పరిస్థితి. అయితే, రెండేళ్లుగా కొన్ని టయర్ 2, 3 నగరాలకూ ఐటీ రంగం విస్తరిస్తోంది. తాజాగా నల్గొండలోనూ ఐటీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

‘‘వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లో ఐటీ హబ్ పెట్టాం. ఇప్పుడు నల్గొండ వంతు వచ్చింది. టయర్ 2 పట్టణాలు, నగరాల్లో ఐటీని ప్రోత్సహించాలన్న విధానంలో భాగంగా నల్గొండలో ఐటీ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం. అందుకోసం ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నాం. మరో 18 నెలల్లో ఐటీ హబ్ కార్యకలాపాలను ప్రారంభిస్తాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.      



More Telugu News