రిటైర్మెంట్ ప్రకటనలో ధోనీకి, డీకాక్ కు పలు పోలికలు!
- ఫ్యామిలీ కోసమే రిటైర్మెంట్ అన్న డాషింగ్ బ్యాటర్
- నిర్ణయం ఆషామాషీగా తీసుకోలేదని వెల్లడి
- త్వరలో తమ కుటుంబంలోకి తొలి బిడ్డ వస్తోందని హర్షం
- బాక్సింగ్ డే టెస్ట్ లో డిసెంబర్ 30నే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ
- అదే రీతిలో ఇప్పుడు డీకాక్ రిటైర్మెంట్
దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాటర్ క్వింటన్ డీకాక్.. వయసు 29 ఏళ్లే. ఎంత లేదనుకున్నా కనీసం ఇంకో ఆరేళ్ల కెరీర్ ఉంది అతడికి. కానీ, ఉన్నట్టుండి టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ లోనే అర్థాంతరంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
అయితే, తన కెరీర్ ఇక్కడితోనే ఆగిపోదని స్పష్టం చేశాడు. కేవలం కుటుంబం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, వేరే కారణాలేమీ లేవని చెప్పాడు. డీకాక్ దంపతులకు అతి త్వరలోనే తొలి సంతానం కలగనుంది. ఈ నేపథ్యంలోనే అతడు ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అతడి రిటైర్మెంట్ కు సంబంధించి క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) కూడా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
‘‘ఇది అంత ఆషామాషీగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. నా భవిష్యత్ గురించి బాగా ఆలోచించాను. ఏది ముఖ్యమో? ఏది కాదో? బేరీజు వేసుకున్నాను. మా జీవితంలోకి తొలి బిడ్డ రాబోతోంది. మా కుటుంబం మరింత పెద్దదవుతోంది. నా కుటుంబమే నాకు సర్వస్వం. అలాంటి కుటుంబం కోసమే వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నా. టెస్ట్ క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా దేశానికి ఆడడాన్ని గర్వంగా భావిస్తా. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను’’ అని డీకాక్ తెలిపాడు.
జీవితంలో ఏదైనా కొనొచ్చని, సమయాన్ని మాత్రం కొనలేమని డీకాక్ చెప్పుకొచ్చాడు. కాబట్టి తానే సర్వస్వం అనుకునేవారి కోసం ఏదో ఒకటి చేయాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. ఇన్నాళ్లపాటు తన టెస్ట్ క్రికెట్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యావాదాలు చెప్పాడు.
“నా కోచ్ లు, సహచర ఆటగాళ్లు, వివిధ టీం మేనేజ్ మెంట్లు, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు. మీరంతా లేకపోయుంటే నేను ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు’’ అని పేర్కొన్నాడు. ఇక్కడితో తన కెరీర్ ముగిసిపోలేదని, వన్డేలకు కొనసాగుతానని స్పష్టం చేశాడు.
కాగా, డీకాక్ రిటైర్మెంట్ కు, ధోనీ రిటైర్మెంట్ కు దగ్గరిపోలికలున్నాయి. 2014లో ధోనీ తన టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ మధ్యలోనే టెస్ట్ కెరీర్ నుంచి తప్పుకొంటున్నట్టు కెప్టెన్ కూల్ ప్రకటించాడు. అంతేకాదు.. యాదృచ్ఛికమో ఏమో గానీ.. అప్పుడు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా డిసెంబర్ 30నే ధోనీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఈ విషయాన్ని ప్రకటించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
ఇప్పుడు డీకాక్ కూడా అదే పద్ధతిలో రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన తొలి మ్యాచ్ బాక్సింగ్ డే టెస్ట్ కావడం, డీకాక్ డిసెంబర్ 30నే రిటైర్మెంట్ ప్రకటించడం కాకతాళీయమే అయినా.. టీమిండియా లెజెండ్ ధోనీ, దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాటర్ ఒకేరోజున రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.
కాగా, డీకాక్ ఇప్పటిదాకా 54 టెస్టులాడి 38.82 సగటుతో 3,300 పరుగులు సాధించాడు. అందులో ఆరు శతకాలు, 22 అర్ధశతకాలున్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 3 వేలకు పైగా పరుగులు సాధించిన రెండో వికెట్ కీపర్ గా డీకాక్ రికార్డ్ కూడా సృష్టించాడు. అంతకుముందు మార్క్ బౌచర్ మాత్రమే ఆ ఫీట్ సాధించాడు.