మరో ఘనతను సాధించిన గాంధీ ఆసుపత్రి.. దక్షిణాదిలో ఇదే తొలి ఆసుపత్రి!

  • ఇండియన్ క్లినికల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్ వర్క్ కి గాంధీ ఆసుపత్రి ఎంపిక
  • ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ భారత ఆసుపత్రి ఇదే
  • కరోనా వైద్య సేవలు కూడా తొలుత గాంధీలోనే ప్రారంభం
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి మరో ఘనతను సాధించింది. ఐసీఎంఆర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రీసర్చ్ (డీహెచ్ఆర్) అభివృద్ధి చేస్తున్న ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్ వర్క్ (ఐఎన్టీఈఎన్టీ)కి గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేశారు. దక్షిణ భారతదేశంలో ఈ ఘనతను సాధించిన తొలి ఆసుపత్రి ఇదే కావడం గమనార్హం. కరోనా వైరస్ కు కూడా తొలుత గాంధీ ఆసుపత్రిలోనే వైద్య సేవలు ప్రారంభం కావడం గమనించాల్సిన విషయం. దక్షిణాది రాష్ట్రాలకు గాను రీజనల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ గా గాంధీ ఆసుపత్రి ఎంపికై సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పటికే ఫార్మా హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్... క్లినికల్ ట్రయల్స్ హబ్ దిశగా కూడా అడుగులు వేస్తోంది.


More Telugu News